June 2, 2011

ఒక రాజ్యం లో అన్నతమ్ములు వుండే వారు...

Leave a Comment
ఒక రాజ్యం లో అన్నతమ్ములు వుండే వారు ...
ఇద్దరు చాలా ప్రేమ, అనురాగం తో ఉండేవారు ...
తండ్రి ని దైవం గా పూజించే వారు ...
పెద్దవాడు "తండ్రి "విగ్రహం చేయించుకుని తన "మందిరం "లో పెట్టున్చుకున్నాడు.
ఎందుకంటే తెల్లవారిన తరువాత లేచి "తండ్రికి " నమస్కరించాలని ..."దైవం "తో సమానమని ..
అట్లాగే తమ్ముడు కూడా "అన్న "విగ్రహం చేయించుకుని తన "మందిరం "లో పెట్టున్చుకున్నాడు.
ఎందుకంటే "తండ్రి తరువాత పెద్దవాడు ,పూజ్యుడు" కనుక ...
ఇలా వారి భక్తీ ని ప్రదర్శించేవారు ...

ఒకనాడు 'అన్న' అర్దరాత్రి కోటకిచేరాడు , అలసిపోయి న కారణం గా పొరపాటున "తమ్ముని మందిరం "లోకి వెళ్లి పడుకున్నాడు ...
అటువైపు తిరిగి తమ్ముడు భార్య నిద్రిస్తుంది ...
'అన్న గారు' అది గ్రహించలేదు.
తరువాత కొంతసేపటికి "తమ్ముడు " తన మందిరం లోకి వచ్చాడు ,చూసి ఆశ్చర్య పోయాడు ...
నెమ్మదిగా అలోచించి "విషయాని "అర్ధం చేసుకున్నాడు ...

అన్న పొరపాటున వచ్చి ఉంటాడని గ్రహించాడు ...
అంతే కాకుండా ఎవరైనా చుస్తే తన 'అన్న'ను తప్పుగా అనుకుంటారేమో అని ఆ రాత్రంతా కాపలా కాసాడు ..

ఇలా ఈ రోజులో ఎవరైనా ఉంటారా ?భార్య పక్కన అన్న ఉంటె ఏమి అయ్యుంటుందని ఆలోచిస్తారా ??
చూడగానే నరికి పారేస్తారు ...కోపం తో ఏమి చేస్తామో మనకే తెలియదు ...

కానీ ఆ తమ్ముడు "విశాల హృదయం" తో ఆలోచించాడు ..
వారిద్దరే "రామ లక్ష్మనులు" ....

తర్వాత రోజు ఉదయం లేచిచుడగానే రామునికి "అతని విగ్రహం "కనపడింది ,
అలోచించి విషయం గ్రహించాడు ... ...
చాలా బాధ పడ్డాడు .
తను ఏ తప్పు చేయక పోయిన,తమ్ముని బార్య పక్కన పడుకున్న నందుకు చింతించాడు

విషయం గురువులతో చెబుతాడు ...
దానికి గురువులు "రామా!నీవు తప్పు చేయలేదు కదా !ఎందుకు బాధ? "అంటారు ..
కానీ రాముని కోరిక మేరకు ప్రయచిత్తం గా ఒక యాగాన్ని చేయమని చెబుతారు ...
దానికి "యాగాన్ని "చేసి తప్పును చేయక పోయిన సరిదిద్దు కుంటాడు ..

అప్పుడు రాముడు ఇలా అంటాడు "సీత లాంటి బార్య ప్రపంచం లో ఎక్కైడైన దొరకచ్చు కానీ "లక్ష్మన్దు " లాంటి తమ్ముడు దొరకడు "

అందుకే "రామలక్ష్మను" లు లోకానికి ఆదర్శం అయ్యారు ...

0 comments: